సోనూ లైఫ్‌‌స్టోరీపై పుస్తకం.. వలస కార్మికుల‌‌‌‌ బాధల మీద ఫోకస్

సోనూ లైఫ్‌‌స్టోరీపై పుస్తకం.. వలస కార్మికుల‌‌‌‌ బాధల మీద ఫోకస్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తన జీవితకథను పుస్తకం రూపంలో తీసుకురానున్నాడు. ఈ బుక్‌‌కు ‘ఐ యామ్ నో మెసయ్య’ అనే పేరును ఖరారు చేశాడు. కరోనా లాక్‌‌డౌన్ టైమ్‌‌లో వలస కూలీలను ఇళ్లకు చేర్చడంలో సోనూ విశేష కృషి చేశాడు. దీంతో అతడికి మెసయ్య ఆఫ్ మైగ్రంట్స్‌‌‌గా పేరొచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, తదితర పరిస్థితుల గురించి తన పుస్తకంలో సోనూ రాశాడని తెలుస్తోంది. ఈ బుక్‌‌కు మీనా అయ్యర్ కో-రైటర్‌‌గా పని చేస్తున్నారు. ‘ప్రజలు నన్ను ఇష్టంతో మెసయ్య అని పిలుస్తున్నారు. కానీ నేను మహాపురుషుడిని కాదని నా నమ్మకం. నా మనసు ఏం చెబుతుందో నేనదే చేస్తా. సాటి మనుషులకు సాయం చేయడం మన కర్తవ్యం’ అని కొత్త పుస్తకం గురించి సోనూ సూద్ పేర్కొన్నాడు. ఈ పుస్తకం డిసెంబర్‌లో అందుబాటులోకి రానుంది.