త్వరలో ఆర్టీసీ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూళ్లు

త్వరలో ఆర్టీసీ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూళ్లు
  • అధికారుల కసరత్తు .. త్వరలో అందుబాటులోకి
  • హైదరాబాద్ రెండు, వరంగల్లో ఒక ఇనిస్టిట్యూట్
  •  ఇతర ప్రాంతాల వారికి బోర్డింగ్ సౌకర్యం కూడా
  •  40 రోజులకో బ్యాచ్.. ఒక్కో బ్యాచ్లో 20 వేల మందికి ట్రైనింగ్

లాక్ డౌన్ కారణంగా ఇన్ కం తగ్గిపోవడంతో దానిని ఎలా పెంచుకోవాలనే దానిపై ఆర్టీసీ కొత్త దారులు వెతుకుతోంది. ఇప్పటికే కార్గో, పార్సిల్ సర్వీ సు లు ప్రారంభించగా.. ఇప్పుడు డ్రైవింగ్  ట్రైనింగ్ సెంటర్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు కసరత్తు స్టార్ట్ చేశారు. త్వరలో హైదరాబాద్ పాటు వరంగల్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. టికెటేతర ఆదాయం ద్వారా ఏటా రూ.200 కోట్లు సంపాదించాలని సంస్థ టార్ట్గెగా పెట్టుకుంది. బస్ పాస్ కౌంటర్లను ఇప్పుడు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. పెట్రోల్ బంకులు కూడా ఔట్ సోర్సింగ్ వారే నడిపి స్తున్నారు. ఈ రెండింటిని కూడా ఆర్సీనేటీ సొంతంగా నడపనుంది, ప్రస్తుతం ఉన్నఅదనపు సిబ్బందిని వీటి కోసం వాడుకోనుంది.

హైదరాబాద్ లో రెండు, వరంగల్ లోఒకటి..

కరోనా కారణంగా 58 రోజులు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత మయ్యాయి. ప్రస్తుతం గ్రేటర్, ఇంటర్ స్టేట్ మినహా జిల్లాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. కానీ కరోనా భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడంలేదు. చాలా రూట్లలో 40 శాతం ఆక్యుపెన్సీ కూడా రావడంలేదు. అయినా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూనే ఉన్నారు. అంతకు ముందు రెండు నెలలపాటు సమ్మె చేయడంతో తీవ్ర నష్టంవాటిల్లింది. దీంతో టికెట్టేతర ఆదాయం పెంచుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో డ్రైవింగ్ కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు, వరంగల్ లో మరొకటి ఉంది. ఇందులో ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే శిక్షణ ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎస్సీ, ఎస్సీ ప్రభుత్వ పథకాల కింద, సింగరేణి వారికి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. ఇటీవల వీరికి పెద్దగా పని ఉండటంలేదు. వీటి స్థలం కూడా వృథాగా ఉంటోంది. వీటన్నింటినీ ఉపయోగించుకో వాలని ఆర్సీ భాటీ విస్తోంది.

డ్రైవింగ్ స్కూళ్ల మాదిరే..

లైట్ మోటార్ వెహికల్తో మొదలుకుని హెవీ బండ్ల వరకు డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అంటేనే సురక్షితం అనే మంచి పేరుందని, దీంతో మంచి రెస్పాన్స్ ఉంటుందని, ముఖ్యంగా విమెన్ నుంచి మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. హైదరాబాదేతర వాళ్లుఉండటానికి రెసిడెన్యల్ షి ఫెసిలిటీ కూడా ఉందన్నారు. అయితే డ్రైవింగ్ చార్జితో పాటు బోర్డింగ్ కు అదనపు చార్జీలు ఉంటాయని చెప్పారు. ప్రతి బ్యాచ్ 40 రోజులు ఉండనుంది. ఒక్కో బ్యాచ్లో 20 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. చార్జీలు ఇంకా ఫైనల్ చేయకపోగా, బయట డ్రైవింగ్ స్కూళ్లలో ఉండే విధంగానే ఉండనున్నట్లు తెలిసింది. సేమ్ డ్రైవింగ్ స్కూళ్లలో ఎలా నేర్పిస్తారో అదే మాదిరిగా ఉంటుందని అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం డ్రైవింగ్ స్కూళ్లలో 30 రోజుల పాటు రోజుకు రెండు గంటల చొప్పున ట్రైనింగ్ ఇస్తున్నా రు. 30 రోజుల్లో వాహనంపై అవగాహన పెంచడం నుంచి మొదలుకొని ఫర్ఫెక్ట్ గా నడిపే దాకా ట్రైనింగ్ ఇస్తారు.