
హైదరాబాద్ నగర ప్రజలకు మొబిలిటీ కార్డు అందుబాటులోకి రానుంది. అన్ని రవాణా సంస్థల్లో ఒకే కార్డుతో ప్రయాణించేలా హైదరాబాద్ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఐటీశాఖకు రవాణా సంస్థలు అందచేశాయి.ఇది అందుబాటులోకి వస్తే MMTS, METRO,RTC , క్యాబ్‌లు, ఆటోల్లో ఈ కార్డుపై ప్రయాణించే అవకాశముంది. దీనిలో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెషిఫికేషన్లను కూడా లెక్కలోనికి తీసుకోనున్నారు. కేంద్రం సిఫారసు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును పరిశీలిస్తున్నారు. లండన్ మెట్రోలో అమలవుతున్న కామన్ మొబిలిటీ కార్డు టెక్నాలజీనీ పరిశీలిస్తున్నారు.
గత నెల 27న ఆర్టీసీ, మెట్రోతోపాటు క్యాబ్ ఆపరేటర్లు, ఆటో యూనియన్ల ప్రతినిధులతో సీఎస్ సమీక్ష జరుపగా ప్రపోజల్స్ అందించారు. త్వరలో అందుబాటులోకి రానున్న కామన్ మొబిలిటీ కార్డు ట్రావెలింగ్‌తోపాటు షాపింగ్‌కు కూడా ఉపయోగపడేట్లు రూపుదిద్దుతున్నారు. MMTS, METRO,RTC బస్సులు, క్యాబ్‌లు, ఆటోల్లో ఉపయోగించే ఈ కార్డు షాపింగ్‌తో పాటు పార్కింగ్ , టోల్ ట్యాక్స్ చెల్లింపులకు కూడా ఉపయోగపడేట్లు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం రూపొందిస్తోంది. ఒక్కో కార్డులో కనీస రీచార్జీ సదుపాయం వెయ్యి రూపాయలుగా నిర్ణయిస్తున్నారు. పక్కాగా సేఫ్టీ ఫీచర్స్‌తో క్యూఆర్ కోడ్‌ను పొందుపరిచి ఉంటుంది. హైదరాబాద్‌లో ప్రారంభించే మెట్రోకార్డు బాధ్యతలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు అందించాలనే ఆలోచనతో ఉన్నారు అధికారులు.