మురుగు నీటితో ఐస్ క్రీమ్ తయారీ

మురుగు నీటితో ఐస్ క్రీమ్ తయారీ

తెలంగాణ‎లో కల్తీ ఐస్ ‎క్రీమ్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కల్తీ ఐస్ క్రీముల తయారీ దందా రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు పోలీసుల నకిలీ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా... రోజుకో చోట బయట పడుతూనే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. మే 16 మంగళవారం తెల్లాపూర్ లోని ఓ ఐస్ క్రీమ్స్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ కంపెనీని నడుపుతున్న నిర్వాహకులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మురుగు నీటితో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తున్న.. యంత్రాలు, కెమికల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తెల్లాపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.