సౌండ్ పార్టీ రిలీజ్‌‌కు రెడీ

సౌండ్ పార్టీ రిలీజ్‌‌కు రెడీ

సంజయ్ శేవీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా రి దర్శకత్వంలో  రూపొందిన చిత్రం  ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మించారు.  నవంబర్ 24న వరల్డ్‌‌వైడ్‌‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. 

ఈ సందర్భంగా నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ ‘ఇదొక ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. బిజినెస్ పరంగా మా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని చెప్పారు.  ‘టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను కూడా  ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు తెలిపాడు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి,  పృథ్వి ఇతర పాత్రలు పోషించారు.