ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టుపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తొలి టెస్టుకు ఆతిధ్యమిస్తుంది. ఓ వైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న సౌతాఫ్రికా.. మరోవైపు స్వదేశంలో తిరుగులేని టీమిండియా. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. ఈ మ్యాచ్ కు టికెట్స్ కూడా ఇప్పటికే సోల్డ్ ఔట్ అయిపోవడం విశేషం. సొంతగడ్డ కావడంతో టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఆరేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు పిచ్ ఎలా ఉండబోతుందో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు గంగూలీ ఒక క్లారిటీ ఇచ్చారు.
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే తొలి టెస్టుకు భారత క్రికెట్ జట్టు స్పిన్-ఫ్రెండ్లీ పిచ్ కోసం రిక్వెస్ట్ చేయలేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించారు. ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు యాజమాన్యం ర్యాంక్-టర్నర్ పిచ్ కావాలని అడగకపోవడంతో ఈ మ్యాచ్ లో బ్యాటర్లు పరుగుల వరద పారించడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3 తేడాతో ఓడిపోవడంతో ప్రత్యేక స్పిన్ ట్రాక్స్ తయారు చేయడంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.
►ALSO READ | ISSF World Championship: చరిత్ర సృష్టించిన సామ్రాట్ రాణా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్
పిచ్ గురించి క్యూరేటర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. " పిచ్ పై చాలా త్వరగా పగుళ్లు కనిపించే అవకాశం ఉంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ బంతి గరుకుగా మారుతుంది. ఇలా జరగడం వలన రివర్స్ స్వింగ్‌కు హెల్ప్ అవుతుంది. బుమ్రాలాంటి ఫాస్ట్ బౌలర్లకు ఇది కలిసొచ్చే విషయం. వికెట్ స్థిరంగా బౌన్స్ అవడంతో పాటు బ్యాటర్లకు సహకరిస్తుంది. నిజానికి ఇది చాలా మంచి బ్యాటింగ్ వికెట్. అని పిచ్ క్యూరేటర్ తెలిపారు. 2019లో ఇండియా- బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈడెన్‌లో జరగబోయే తొలి టెస్ట్ ఇదే కావడం గమనార్హం.
