సోర్స్ : అమిత్ షాకు హోం… రాజ్‌నాథ్‌కు డిఫెన్స్!

సోర్స్ : అమిత్ షాకు హోం… రాజ్‌నాథ్‌కు డిఫెన్స్!

తొలివిడతలో  కేబినెట్ లోకి 60  మంది వరకు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.మిత్రపక్షాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ లో బెర్త్ దక్కవచ్చని తెలుస్తోంది. బీజేపీ నుంచి కీలక మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, బెంగాల్ , గోవా, ఢిల్లీ, కర్ణాటకలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.

బీజేపీ చీఫ్ అమిత్ షా మోడీ టీంలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. అమిత్ షాను కేబినెట్ లోకి తీసుకుంటే ఆయనకు హోంశాఖ ఇచ్చి… రాజ్ నాథ్ ను డిఫెన్స్ కు షిఫ్ట్ చేసే చాన్స్ ఉంది.

అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాకు బీజేపీ పగ్గాలు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. సుష్మాస్వరాజ్ కు రెస్ట్ ఇవ్వవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. స్మృతి ఇరానీ, రిజిజుకు ప్రమోషన్ దక్కే చాన్సుంది.

కేబినెట్ లోకి తనను తీసుకోవద్దని అరుణ్  జైట్లీ ఇప్పటికే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. అతని ప్లేస్ ను ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

పియూష్ గోయల్ కు ఆర్థికశాఖ ఇవ్వొచ్చని తెలుస్తోంది. జయంత్ సిన్హా పేరు కూడా వినిపిస్తోంది.

తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది.