బెంగళూరు: సౌతాఫ్రికా–ఎతో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్‌లో ఇండియా–ఎ బౌలర్లు చెలరేగారు. ప్రసిధ్ కృష్ణ (3/35), మహ్మద్ సిరాజ్ (2/61), ఆకాశ్ దీప్ (2/28) సమయోచితంగా రాణించడంతో.. శుక్రవారం రెండో రోజు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47.3 ఓవర్లలో 221 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ (134) సెంచరీతో చెలరేగినా రెండో ఎండ్‌లో సహకారం కరువైంది. జోర్డాన్ హెర్మాన్ (26), ప్రేనేలన్ సుబ్రాయెన్ (20) ఓ మాదిరిగా ఆడారు.
ఇన్నింగ్స్‌లో 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా–ఎ ఆట ముగిసే టైమ్‌కు 24 ఓవర్లలో 78/3 స్కోరు చేసింది. రాహుల్ (26 బ్యాటింగ్), కుల్దీప్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (0) నిరాశపర్చినా, దేవదత్ పడిక్కల్ (24) ఫర్వాలేదనిపించాడు. 34 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇండియా 112 రన్స్ ఓవరాల్ లీడ్‌లో కొనసాగుతోంది.
