SA v IND:టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా..స్టార్ ఆల్ రౌండర్లను పక్కన పెట్టేసిన భారత్

SA v IND:టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా..స్టార్ ఆల్ రౌండర్లను పక్కన పెట్టేసిన భారత్

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ చివరిదైన మూడో టెస్టు నేడు (జనవరి 3) ఆడనుంది. న్యూల్యాండ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. దీంతో రెండో టెస్టులో విజయం సాధిస్తే తప్ప సిరీస్ కాపాడుకోలేరు. ఈ మ్యాచ్ లోనూ గెలిచి  సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని సఫారీలు భావిస్తుంటే..సిరీస్ సమం చేయాలని టీమిండియా గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 

ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులో స్థానం దక్కింది. మరో వైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూలు ఠాకూర్ పక్కన పెట్టి స్పెషలిస్ట్ పేసర్ ముకేశ్ కుమార్ కు అవకాశమిచ్చారు. 

భారత తుది జట్టు    

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్

సౌతాఫ్రికా తుది జట్టు 

డీన్ ఎల్గర్(కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాండ్రే బర్గర్, లుంగి ఎన్‌గిడి