‘ఆటమ్‌’కు సౌత్‌ ఆఫ్రికా పేటెంట్‌

‘ఆటమ్‌’కు సౌత్‌ ఆఫ్రికా పేటెంట్‌
  • ఆఫ్రికా దేశాలలో విస్తరించేందుకు మరింత వీలు
  • ఇదొక యూనిక్ ప్రొడక్టన్న సౌత్ ఆఫ్రికా పేటెంట్ ఆఫీస్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విశాక ఇండస్ట్రీస్‌‌కు చెందిన ‘ఆటమ్‌‌’ సోలర్‌‌ రూఫ్‌‌ ప్రొడక్ట్‌‌కు సౌత్‌‌ ఆఫ్రికా‌‌ నుంచి పేటెంట్ దక్కింది. పేటెంట్‌‌ వ్యాలిడిటీ 20 ఏళ్లు. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో పేటెంట్‌‌ కోసం కంపెనీ అప్లయ్‌‌ చేసుకొంది. తాజాగా పేటెంట్‌‌ పొందడంతో  సౌత్‌‌ ఆఫ్రికాతో పాటు, ఇతర ఆఫ్రికా దేశాలలో ఆటమ్‌‌ ప్రొడక్ట్‌‌లను విస్తరించడానికి కంపెనీకి వీలుంటుంది. ఆటమ్‌‌లో పాలీ లేదా మోనో క్రిష్టలిన్ సోలార్ సెల్స్‌‌ను, సిమెంట్‌‌ను బోర్డులను వాడి యూనిక్‌‌గా తయారుచేస్తున్నారు. వీటిని డైరక్ట్‌‌గా ఇళ్లపై రూఫ్‌‌లుగా వాడుకోవచ్చు. ఎలక్ట్రిసిటీని  జనరేట్ చేసుకోవచ్చు. ‘కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో పేటెంట్‌‌ కోసం అప్లయ్‌‌ చేశాం. సౌత్‌‌ ఆఫ్రికా పేటెంట్‌‌ ఆఫీస్‌‌ నుంచి ఆటమ్‌‌కు పేటెంట్‌‌ దక్కినందుకు గర్వంగా ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఆటమ్‌‌ అనేక మార్పులు తెస్తుందన్న మా నమ్మకాన్ని ఈ పేటెంట్ మరింత బలపరిచింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆదరించే  నిజమైన మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌‌ మన దగ్గరుంది.  పర్యావరణానికి అనుకూలంగా ఉండి, ఎనర్జీని జనరేట్ చేసే ప్రపంచంలోనే  మొదటి ప్రొడక్ట్‌‌ ఆటమ్‌‌. సస్టయినబుల్‌‌, గ్రీన్‌‌ టెక్నాలజీలపై ఫోకస్ పెట్టాం’ అని విశాక ఇండస్ట్రీస్‌‌ జాయింట్‌‌ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. ‘బిల్డింగ్–సోలార్ సిస్టమ్స్‌‌ కలయికకు సంబంధించింది ఈ ఇన్వెన్షన్‌‌. ఇదొక సోలార్ బోర్డ్‌‌, దీన్ని రూఫ్‌‌లు, ఇతర బిల్డింగ్‌‌ అప్లికేషన్లుగా వాడుకోవచ్చు. సిమెంట్‌‌ బోర్డులను–సోలార్ ప్యానెల్స్‌‌ను కలిపి  సోలార్ సిమెంట్‌‌ బోర్డులను ఒక సింగిల్ ప్రొడక్ట్‌‌గా ఎలా తయారు చేయాలి, డిజైనింగ్‌‌ వంటి వాటికి సంబంధించి ఈ పేటెంట్ ఉంది. ఇది అల్టిమేట్లీ ఒక యూనిక్‌‌ ప్రొడక్ట్‌‌’ అని ఆటమ్‌‌కు పేటెంట్ ఇస్తున్న సందర్భంగా సౌత్ ఆఫ్రికా పేటెంట్ ఆఫీస్‌‌ ఈ కామెంట్ చేసింది.