కేఎల్ రాహుల్ సెంచరీ..నిలకడగా భారత్ బ్యాటింగ్

కేఎల్ రాహుల్ సెంచరీ..నిలకడగా భారత్ బ్యాటింగ్

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఒపెనర్ కేఎల్ రాహుల్ 99 పరుగుల వద్ద కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్ కు ఇది ఏడో సెంచరీ.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకు ఇవాళ మంచి ఒపెనింగ్ దక్కింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఆచితూచి ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త తీసుకున్నారు.  మయాంక్ అగర్వాల్ 123 బంతుల్లో 60 రన్స్ చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా డకౌట్ అవ్వగా..కెప్టెన్ కొహ్లీ 35 పరుగులకు పెవిలియన్ చేరాడు.  ప్రస్తుతం భారత్ 81 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 111, అజింక్యా రహానె 32పరుగులతో క్రీజులో ఉన్నారు.