- ఆర్సీ పురంలోనూ అధికారులతో కలిసి పరిశీలన
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని లింగంపల్లి, రామచంద్రాపురం రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెయిటింగ్ హాల్, టికెటింగ్ సౌకర్యాలు, లిఫ్ట్‌లు, ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్‌లోని రైలు నిర్వహణ సౌకర్యాలను కూడా సమగ్రంగా పరిశీలించారు.
ట్రాక్‌ల పరిస్థితి, మౌలిక వసతుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాలు, కార్యకలాపాల సామర్థ్యాన్ని ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రైల్వే సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డివిజనల్ అధికారులు స్టేషన్లో తదుపరి విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల గురించి జనరల్ మేనేజర్‌కు వివరించారు. ఆయన వెంట సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ అధికారులు, బ్రాంచ్ అధికారులు ఉన్నారు.
