
తిరుపతి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ - గూడూరు సెక్షన్లో కొన్ని పనుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ - గూడూరు సెక్షన్ కి సంబంధించి మూడో లైన్లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు నెలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు రైల్వే అధికారులు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది.
ఇంటర్ లాకింగ్ పనుల వల్ల రద్దైన రైళ్లు ఇవే:
ఆగస్టు 11 నుంచి 20 వరకు రేణిగుంట - కాకినాడ - రేణిగుంట రైలు (17249/17250), ఆగస్టు 17 నుంచి 19 వరకు తిరుపతి - లింగంపల్లి - తిరుపతి (12733/12734) రైలు రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు. ఆగస్టు 13 నుంచి 20 వరకు తిరుపతి - ఆదిలాబాద్ - తిరుపతి (17405/17406) రైలు , ఆగస్టు 11 నుంచి 19 వరకు నర్సాపురం ధర్మవరం - నర్సాపురం ఎక్స్ ప్రెస్ (172476/17248) రైలును రద్దు చేసినట్లు ప్రకటించినట్లు తెలిపారు రైల్వే అధికారులు.
ఆగస్టు 14, 15, 16 తేదీల్లో విశాఖపట్నం తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు (22707), ఆగస్టు 13, 15, 17 తేదీల్లో తిరుపతి - విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైలు (22708), రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆగస్టు 17న తిరుపతి - నర్సాపూర్ ( 07131 ) రైలు, ఆగస్టు 18న నర్సాపూర్ - తిరుపతి రైలు (07132) రైలు రద్దు చేసినట్లు తెలిపింది.
Cancellation of trains due to non-interlocking works for commissioning of 3rd line between Vijayawada - Gudur Section @drmvijayawada pic.twitter.com/1wOUPameUG
— South Central Railway (@SCRailwayIndia) July 30, 2025