250 గూడ్స్‌గార్డ్‌ పోస్టుల భర్తీకి  SER నోటిఫికేషన్‌ జారీ

V6 Velugu Posted on Dec 03, 2021

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ భారతీయ రైల్వే.  దీనికి సంబంధించి  సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (SER) ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌  పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్  బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం 520 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 23 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు కోల్‌కతా సెంటర్ గా పనిచేయాల్సి ఉంటుంది. 

మొత్తం ఖాళీ పోస్టులు: 520

వీటిలో జనరల్‌-277,OBC-87,SC-126,ST-30 కి  కేటాయించారు.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

ఏజ్ లిమిట్: అభ్యర్థుల వయసు 42 ఏళ్ల లోపువారై ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, అర్థమెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు.

వెబ్‌సైట్ : అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcser.co.in/ 

Tagged Replacement, issued notification, South Eastern Railway, 250 Goods Guard posts

Latest Videos

Subscribe Now

More News