షాపింగ్​ చేసిన వారికి రూ.ఆరు కోట్ల విలువ చేసే బహుమతులు

షాపింగ్​ చేసిన వారికి రూ.ఆరు కోట్ల విలువ చేసే బహుమతులు

హైదరాబాద్​, వెలుగు:  పండుగలను పురస్కరించుకొని సౌతిండియా షాపింగ్​ మాల్ తన కస్టమర్లకు కానుకలు, డిస్కౌంట్లు, లక్కీ బంపర్​ డ్రా వంటివి అందుబాటులోకి తెచ్చింది. పోయిన నెల 12న మొదలైన ఫెస్టివల్​ సేల్ ఈ నెల 25 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా షాపింగ్​ చేసిన వారికి రూ.ఆరు కోట్ల విలువ చేసే బహుమతులను ఇస్తారు. విజేతల పేర్లను 5.10.22, 25.10.22 తేదీల్లో లక్కీడ్రా తీసి  ప్రకటిస్తారు.

వీరికి 50 మారుతీ సుజుకీ ఎస్​ప్రెస్సో కార్లు, 130 బైక్​వో ఎలక్ట్రిక్​ బైకులు, 100 వెండి పళ్లేలు, 1,140 ఇండక్షన్​ స్టవ్​లు, 480 ట్యాబ్స్​ వంటివి ఇస్తారు. చీరెలు, మెన్స్​వేర్​పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. కేవలం మూడుశాతం తరుగుతో బంగారు నగలు, తరుగు, మజూరీ లేకుండా వెండి నగలు అందుబాటులో ఉన్నాయని సౌతిండియా షాపింగ్​ మాల్ డైరెక్టర్​ పీవీఎస్​ అభినయ్​ చెప్పారు. మొత్తం రెండు వేల మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులను అందిస్తామని చెప్పారు.