గ్వాడలహరా (మెక్సికో): ఫిఫా వరల్డ్ కప్‌లో సౌత్ కొరియా బోణీ చేసింది. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో కొరియా 2–1తో చెక్ రిపబ్లిక్‌పై నెగ్గింది. మ్యాచ్ ప్రారంభంలో వెనకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి విజయాన్ని సాధించింది. హ్వాంగ్ ఇన్-బోమ్ (67వ ని), ఓ హ్యోంగ్-యు (80వ ని) కొరియాకు గోల్స్ అందించగా, లాడిస్లావ్ క్రెజ్సీ (59వ ని) చెక్ తరఫున ఏకైక గోల్ సాధించాడు.
వరల్డ్ కప్ చరిత్రలో 2010 తర్వాత కొరియాకు ఇది తొలి గెలుపు కావడం విశేషం. అలాగే మెగా టోర్నీలో యూరోపియన్ జట్లపై కొరియాకు వరుసగా మూడో విజయం. అంతకుముందు 2018లో జర్మనీని, 2022లో పోర్చుగల్‌ను ఓడించింది.
ఆట ఆరంభం నుంచే కొరియా ఫార్వర్డ్ సన్ హ్యుంగ్ మిన్ నేతృత్వంలోని ప్లేయర్లు మ్యాచ్‌పై నియంత్రణ సాధించారు. చెక్ దాడులను సమర్థంగా తిప్పి కొట్టారు. దాంతో తొలి హాఫ్‌లో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి.
