గడువులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే పరిహారం..విద్యుత్ శాఖలో కొత్త నిబంధనలు

గడువులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే పరిహారం..విద్యుత్ శాఖలో కొత్త నిబంధనలు
  •     మూడంచెల ఫిర్యాదుల వ్యవస్థను ప్రకటించిన సదరన్ డిస్కమ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త నిబంధనలు ప్రకటించింది. విద్యుత్​సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకేసారి 12 గంటలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే పరిహారం ఇవ్వాలి. ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో మార్చాలి. బిల్లు చెల్లించాక పట్టణాల్లో 4 గంటల్లో, గ్రామాల్లో 12 గంటల్లో కనెక్షన్ ఇవ్వాలి. 

కాలిపోయిన మీటర్లను 7 రోజుల్లో మార్చాలి. ఫ్యూజ్ సమస్యలను పట్టణాల్లో 4 గంటల్లో, గ్రామాల్లో 8 గంటల్లో పరిష్కరించాలి. కేబుల్ బ్రేక్‌‌‌‌డౌన్‌‌‌‌ను వరుసగా 6, 24 గంటల్లో సరిచేయాలి. కొత్త కనెక్షన్లు 30 రోజుల్లో ఇవ్వాలి. తొలుత టోల్‌‌‌‌ఫ్రీ నంబర్ 1912, వెబ్‌‌‌‌సైట్, ఆన్‌‌‌‌లైన్ పోర్టల్ లేదా స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. పరిష్కారం కాకపోతే జిల్లాల వారీగా ఉన్న వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌)ను ఆశ్రయించాలి. అక్కడా పరిష్కారం లభించకపోతే ఈఆర్‌‌‌‌సీ రెగ్యులేషన్ నం.06 ఆఫ్ 2026 ప్రకారం విద్యుత్ అంబుడ్స్‌‌‌‌మన్‌‌‌‌కు ఫిర్యాదు చేయవచ్చు. గడువులోగా సేవలు అందకపోతే రెగ్యులేషన్ నం.5 ఆఫ్ 2016 ప్రకారం పరిహారం పొందవచ్చని సదరన్ డిస్కమ్‌‌‌‌ తెలిపింది.