తెలంగాణను చూసి దేశం చాలా నేర్చుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి

 తెలంగాణను చూసి దేశం చాలా నేర్చుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణను చూసి దేశం చాలా నేర్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గతంలో దర్భార్లో సంచుల నిండా అర్జీలు వచ్చేవని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితి మారిపోయిందని అన్నారు. అందుకే దర్భార్లో ఇప్పుడు వినతులు రావడం లేదన్నారు. జాతరకు వచ్చిన కేంద్రమంత్రి అర్జున్ ముండా నాగోబా అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఎంపీ సోయం బాపూరావు ప్రజా సమస్యలపై ఏ ఒక్క మీటింగ్ కు రాడని, దర్భార్ కు రాని ఆయన ప్రజాప్రతినిధి ఎలా అవుతాడని ఇంద్రకరణ్ ప్రశ్నించారు.

నాగోబా అభివృద్ధికి త్వరలో రూ.12.5 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. మారుమూల ప్రాంతాలన్నింటికి త్వరలోనే త్రీ ఫేజ్ కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు అతి త్వరలోనే పట్టాలిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. నాలుగేళ్లుగా ఏజెన్సీలో విషజ్వరాలు లేవని, జిల్లాలో ఇంకేమైనా సమస్యలుంటే పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు.