బ్లాక్ స్పాట్ల వద్ద బోర్డులు పెట్టండి : ఎస్పీ అఖిల్ మహాజన్

బ్లాక్ స్పాట్ల వద్ద బోర్డులు పెట్టండి : ఎస్పీ అఖిల్ మహాజన్

నేరడిగొండ, వెలుగు: నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల పరిధిలోని నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినా ప్రదేశాలను గురువారం ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి పరిశీలించారు. 

మూడు మండలాలను కలిపే నేషనల్ హైవేపై రెండేండ్లుగా ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిన ప్రాంతాలను బ్లాక్​స్పాట్ లుగా గుర్తించి, బోర్డులు పెట్టాలని, అప్రోచ్​రోడ్లపై స్పీడ్​బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్ల రిపేర్​జరిగితే సంబంధిత పనులను పర్యవేక్షించాలని, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సైలు శ్రీకాంత్, సయ్యద్ ఇమ్రాన్, పురుషోత్తం పాల్గొన్నారు.