మున్సిపల్ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు

మున్సిపల్ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరగనున్న మున్సిపల్​ కార్పొరేషన్, మున్సిపల్​ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు పోలీస్​ ఆఫీసర్లను ఆదేశించారు. పోలీస్ హెడ్ క్వార్టర్​లో సోమవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సైబర్​ నేరాలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా పెట్టాలన్నారు. పోక్సో కేసుల్లోని నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​ కుమార్​ సింగ్​, డీఎస్పీలు సతీశ్​కుమార్, చంద్రభాను, రవీందర్, మల్లయ్య స్వామి, బి.అశోక్​పాల్గొన్నారు.