ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత

ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత

యూపీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలోనే బరేలీలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాంకు చెందిన పెట్రోల్ పంపును అధికారులు నేలమట్టం చేశారు. మ్యాప్ అప్రూవల్ లేకుండానే బంకును నిర్మించినందుకు దాన్ని కూల్చి వేసినట్లు చెప్పారు. ఈ మధ్యనే ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం సీఎం యోగి ఆదిత్యనాథ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తమ జోలికొస్తే తుపాకులు గర్జిస్తాయని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బంకు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది.