
కడప : పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది గుండెపోటు మరణం కాదనీ.. ఆయన్ను హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చామని చెప్పారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. తలపైనే 3,4 గాయాలు.. ఒంటిపై మరిన్ని గాయాలు… ఘటనా స్థలంలో ఆయన పడి ఉన్న పరిస్థితులు… పోస్టు మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా.. వైఎస్ వివేకానందరెడ్డిని ఉద్దేశపూర్వకంగా కొందరు మర్డర్ చేసినట్టుగా ధ్రువీకరణకు వచ్చామని చెప్పారు. పులివెందుల పీఎస్ లో సెక్షన్ 171 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారనీ.. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సెక్షన్ 302 కింద మర్డర్ కేసు పెట్టామని… దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం కడప జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ‘సిట్’ ఏర్పాటు చేశామన్నారు.