శిక్షణకు బైలెల్లిన కానిస్టేబుళ్లు

 శిక్షణకు బైలెల్లిన కానిస్టేబుళ్లు

ఖమ్మం టౌన్/చుంచుపల్లి, వెలుగు  :  పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక, దృఢత్వం ప్రధానమని ఖమ్మం సీపీ సునీల్ దత్, భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్​ రాజు సూచించారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్​మెంట్​బోర్డు ద్వారా  ఎంపికైన కానిస్టేబుళ్లను  తొమ్మిది నెలలపాటు ట్రైనింగ్​ కు పంపినట్లు వారు తెలిపారు. 

ఖమ్మం నుంచి 158 మంది..

శిక్షణ కోసం ఖమ్మం జిల్లా నుంచి వెళ్తున్న 158 మంది సివిల్, ఏఆర్ స్టైఫండరీ ట్రైనీ పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్లకు పోలీస్ ఐడెంటిఫికేషన్ కార్డు, కిట్ ఆర్టికల్స్ ను పోలీస్ కమిషనర్ అందజేశారు. ఖమ్మం పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ నుంచి శిక్షణకు వెళ్తున్న158 మందిలో 54 మంది సివిల్‌‌‌‌ ట్రైనీ కానిస్టేబుళ్లు, 55 మంది ఆర్మూడ్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ కానిస్టేబుళ్లు ఉన్నారని సీపీ తెలిపారు. 33 మంది మహిళా సివిల్‌‌‌‌ కానిస్టేబుళ్లు,16 మంది మహిళా ఆర్మ్​డ్​ రిజర్వ్‌‌‌‌ కానిస్టేబుళ్లు ఉన్నారని చెప్పారు. వీరందరికీ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌‌‌‌ అకాడమీతో పాటు, పీటీసీ వరంగల్, సీటీసీ సైబరాబాద్, 8వ బెటాలియన్‌‌‌‌ల్లో శిక్షణ ఇవ్వనునట్లు తెలిపారు. సీసీఆర్బీ ఏసీపీ గణేశ్, ఏఓ అక్తరూనీసాబేగం, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, అప్పలనాయుడు, సీఐలు అంజలి, స్వామి, వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ జానకీరామ్ పాల్గొన్నారు. 

భద్రాద్రికొత్తగూడెం నుంచి 75 మంది.. 

శిక్షణ కోసం భద్రాద్రికొత్తగూడెం  జిల్లా నుంచి 75 ఎంపికకైనట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పురుషులు 27 మందిని సైబరాబాద్ ట్రైనింగ్ సెంటర్ కు, సివిల్ మహిళలు 18 మందిని పీటీసీ వరంగల్ కు, ఆర్మూడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ పురుషులు 22 మందిని మొదటి బెటాలియన్ యూసుఫ్ గూడ, ఏఆర్ మహిళలు ఎనిమిది మందిని టీఎస్​పీఏ ట్రైనింగ్ సెంటర్లకు పంపినట్లు చెప్పారు. మంగళవారం వీరిని జిల్లా పోలీస్ హెడ్​ క్వార్టర్స్ నుంచి ప్రత్యేక వాహనాలలో ఆయా ట్రైనింగ్ సెంటర్లకు శిక్షణ కోసం పంపించినట్లు తెలిపారు. శిక్షణలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,అడ్మిన్ ఆర్ఐ రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.