అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ

మద్నూర్, వెలుగు: మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ సింధూ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహరాష్ట్రకు సరిహద్దులో మద్నూర్ మండలం ఉండడంతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. డీఎస్సీ జగన్నాథ్ రెడ్డి, సీఐ కృష్ణ, ఎస్ఐ కృష్ణారెడ్డి ఉన్నారు.