సిరిసిల్ల హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్

సిరిసిల్ల హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో ఇద్దరు జర్నలిస్టులపై దాడి చేసిన  హెడ్ కానిస్టేబుల్ ను ఎస్పీ రాహుల్ హెగ్డే సస్పెండ్ చేశారు. సిరిసిల్లలో ఇటీవల ఓ డైలీ న్యూస్ పేపర్లో  పనిచేస్తున్న ఇద్దరు సబ్ ఎడిటర్లు డ్యూటీ  అయిపోయిన తర్వాత  రాత్రి ఇంటికి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ పద్మారావు వారిపై దాడి చేశారు. ఈ ఘటనపై  జర్నలిస్టు సంఘాలు నిరసనకు దిగడంతో  హెడ్ కానిస్టేబుల్ పద్మారావును సస్పెండ్ చేస్తూ సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే  ఉత్తర్వులు జారీ చేశారు.