
హైదరాబాద్, వెలుగు: రిటైల్ సెక్టార్‌లో ఏఐ వాడకాన్ని పెంచడానికి చెన్నై బేస్డ్ ఎనలిటిక్స్ అండ్ ఏఐ కంపెనీ పాత్‌ఫైండర్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌తో స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ చేతులు కలిపింది. ఈ రెండు కంపెనీలు విలీనం అవ్వడానికి ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ద్వారా పాత్‌ఫైండర్ తెచ్చిన ఏఐ ప్లాట్‌ఫామ్ రిటైల్‌జీపీటీని స్పేస్‌నెట్ సాప్ట్‌వేర్ డివిజన్ వాడడానికి వీలుంటుంది. ఫిజికల్, డిజిటల్ రిటైల్ మధ్య గ్యాప్‌ను తగ్గించడానికి రిటైల్‌జీపీటీ సాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ మెర్జర్‌లో భాగంగా స్పేస్‌నెట్ షేర్‌హోల్డర్లు పాత్‌ఫైండర్ షేర్లను పొందుతారు. జనరేటివ్ ఏఐ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేసేందుకు కంపెనీ షేర్‌హోల్డర్లకు వీలుంటుందని స్పేస్‌నెట్ పేర్కొంది. స్పేస్‌నెట్ సాఫ్ట్‌వేర్ డివిజన్, పాత్‌ఫైండర్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, పాత్‌ఫైండర్ ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అవుతుంది. స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గురువారం 4 శాతం తగ్గి రూ. 15.35 దగ్గర క్లోజయ్యాయి. 2030 నాటికి ఏఐ మార్కెట్ సైజ్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.