అట్లాంటా: వరల్డ్ కప్‌లో యూరోపియన్ చాంపియన్ స్పెయిన్ ఫామ్‌లోకి వచ్చింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్–హెచ్ మ్యాచ్‌లో స్పెయిన్ 4–0తో సౌదీ అరేబియాను చిత్తు చేసింది. లామినె యామాల్ (10వ ని), మైకేల్ ఒయర్జబల్ (21, 24వ ని), హసన్ అల్తాంబక్తి (49వ ని) స్పెయిన్‌కు గోల్స్ అందించారు.
18 ఏళ్ల లామిన్ యామాల్.. వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో గోల్ చేసిన ఎనిమిదో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. సెకండాఫ్ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే స్పెయిన్ ఆటగాడు మార్క్ కుకురెల్లా కొట్టిన షాట్.. సౌదీ డిఫెండర్ హసన్ అల్తాంబక్తిని తాకుతూ ఓన్ గోల్‌గా మారింది.
