అసెంబ్లీ నిరవధిక వాయిదా .. 8 రోజుల పాటు కొనసాగిన సభ

అసెంబ్లీ నిరవధిక వాయిదా .. 8 రోజుల పాటు కొనసాగిన సభ
  • మూడు బిల్లులకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు కొనసాగాయని స్పీకర్ తెలిపారు. అసెంబ్లీ 45 గంటల 32 నిమిషాల పాటు కొనసాగిందని, ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టామని, 
మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ చెప్పారు.

59 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన జీరో అవర్​లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని వెల్లడించారు. ఈ నెల 10న డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్  భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కులగణన తీర్మానాన్ని  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టగా చర్చ తరువాత సభ ఏకగ్రీవంగా  ఆమోదించింది.