రెండో రోజు 14 నామినేషన్లు

రెండో రోజు 14 నామినేషన్లు

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో శనివారం రెండో రోజు14 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్​ నుంచి కాంగ్రెస్​అభ్యర్థి పి.సుదర్శన్​రెడ్డి తరఫున ఆ పార్టీ లీడర్లు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. నిజామాబాద్​అర్బన్​లో దండు లత (బీఎల్ఎఫ్​), రాగి అనిల్​(ఇండిపెండెంట్) రూరల్​సెగ్మెంట్​నుంచి దేగావత్​శివరాం (ఇండిపెండెంట్), సాయన్న (ఆల్​ ఇండియా మజ్లిస్ –ఏ– ఇంక్విలాబ్​మిల్లత్), ఆర్మూర్​లో ఎన్.ప్రణయ్​గౌడ్​(ఇండిపెండెంట్) నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి నియోజక వర్గంలో  ఆరుగురు ఇండింపెండెంట్అభ్యర్థులు రమేశ్​కుమార్, చంద్రశేఖర్, నటరాజు, నిఖిల్​రెడ్డి,  సంతోష్​కుమార్,  సాయన్న నామినేషన్లు వేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ తరఫున స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి, జుక్కల్​లో బీఎస్పీ నుంచి ఏకాంబికర్​ నామినేషన్ వేశారు.​