ఇందిరా గాంధీ నిర్ణయంతోనే ఉన్నత స్థానాల్లో ఎస్టీలు : స్పీకర్ ప్రసాద్ కుమార్

ఇందిరా గాంధీ నిర్ణయంతోనే ఉన్నత స్థానాల్లో ఎస్టీలు : స్పీకర్ ప్రసాద్ కుమార్
  • 1976లోనే ఎస్టీల సంక్షేమానికి 
  • 17 వేల కోట్లు కేటాయించారు: స్పీకర్​ ప్రసాద్​ కుమార్

హైదరాబాద్, వెలుగు: 1976లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయంతోనే ఈరోజు ఎస్టీలు విద్య, ఉద్యోగాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అప్పట్లో ఎస్టీలకు రూ.17,600 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని ఆయన గుర్తుచేశారు. బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఎస్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, విప్ రాంచంద్రునాయక్ , ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలకు నేతలు పాలాభిషేకం చేశారు.