
- పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలో 5 జిల్లాల ఎంపిక
- 33 పీహెచ్ సీల పరిధిలో అమలుకు చర్యలు
- డాక్టర్లకు ట్రైనింగ్
గర్భిణుల్లో రక్తహీనత సమస్య(ఎనీమియా) పెరుగుతోంది. దాంతోపాటు హై బీపీ, డయాబెటిస్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ప్రసూతి సమయంలో గర్భిణులు చనిపోతున్నారు. హైరిస్క్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రసూతి మరణాల నియంత్రణకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. ప్రసూతి మరణాలకు దారి తీస్తున్న పరిస్థితులను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి, తదనుగుణంగా గర్భిణులకు మెరుగైన చికిత్స అందించడం, ఆసుపత్రుల్లో ప్రసూతి సేవల నాణ్యత పెంచడం కోసం ప్రత్యేకంగా ‘మిరా’ అనే యాప్ రూపొందించింది.
మెదక్/రామాయంపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రతి లక్ష మంది గర్భిణుల్లో ప్రసవం సమయంలో 56 మంది చనిపోతున్నారు. 2016–18లో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు 63 నమోదు కాగా 2017–19 వచ్చేసరికి 56కు తగ్గాయి. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు పబ్లిక్హెల్త్ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. మెదక్ జిల్లాలో 60 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉంది. అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 50 నుంచి 55 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో హైరిస్క్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రసూతి మరణాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన మిరా యాప్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ఈ ఐదు జిల్లాల్లో అమలు చేయనున్నారు. తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో ఆయా జిల్లాల పరిధిలో 33 పీహెచ్సీలలో ఈ యాప్ ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఇది సక్సెస్అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు.
యాప్‌తో స్క్రీనింగ్..
ఎలక్ట్రానిక్ డిసిషన్సపోర్ట్సిస్టం(ఈడీఎస్ఎస్) ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. గర్భిణుల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. వారిలో ఎనిమియా, జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్(జీడీఎం), గర్భధారణ ప్రేరిత రక్తపోటు(పీఐహెచ్) ఏ స్థాయిలో ఉందనేది ఈ యాప్ స్క్రీనింగ్ చేస్తుంది. అంతేగాక ఆయా సమస్యలను నియంత్రించేందుకు ఎలాంటి ట్రీట్మెంట్అందించాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది. తదనుగుణంగా డాక్టర్లు, మెడికల్స్టాఫ్వారికి ట్రీట్మెంట్అందజేస్తారు. ఈ అధ్యయనానికి యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి.
డాక్టర్లకు ట్రైనింగ్
ప్రసూతి మరణాల నియంత్రణకు ఉద్దేశించిన యాప్ వినియోగంపై ఈ నెల 6, 7 తేదీల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పీహెచ్సీ డాక్టర్లకు మెదక్ జిల్లా రామాయంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో ట్రైనింగ్ ఇచ్చారు. 8, 9 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డాక్టర్లకు, 12, 13 తేదీల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన డాక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్ క్లాస్‌లు పూర్తయ్యాక, శిక్షణ పొందిన డాక్టర్లు వారి పీహెచ్సీ పరిధిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తారు.