హజ్​ యాత్రికుల కోసం ప్రత్యేక కౌంటర్

హజ్​ యాత్రికుల కోసం ప్రత్యేక కౌంటర్

వెలుగు, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్​ యాత్రకు వెళ్లేవారి అప్లికేషన్ల ప్రాసెసింగ్ ​కోసం సికింద్రాబాద్ లోని రీజనల్​ పాస్​పోర్టు ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ ను​ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజనల్​ పాస్​పోర్టు ఆఫీసర్​ స్నేహజ ఒక ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్​13, 15, 18 తేదీలలో మాత్రమే ప్రత్యేక కౌంటర్​ తెరచి ఉంటుందని, రాష్ట్ర హజ్​ కమిటీ ద్వారా పంపబడిన పాస్​పోర్టులు మాత్రమే ప్రాసెసింగ్​ చేయబడతాయని తెలిపారు. డిసెంబర్​ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్​ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు. దరఖాస్తు దారులు తప్పని సరిగా జనవరి 31, 2025 వరకు చెల్లుబాటు అయ్యే పాస్​పోర్టును కలిగి ఉండాలని పేర్కొన్నారు.