ఎమ్మెల్యే అరూరి పేరుతో ఉన్న బ్యాగులు స్వాధీనం.. సర్పంచ్​ ఇంట్లో సీజ్​ చేసిన అధికారులు

ఎమ్మెల్యే అరూరి పేరుతో ఉన్న బ్యాగులు స్వాధీనం.. సర్పంచ్​ ఇంట్లో సీజ్​ చేసిన అధికారులు

వర్ధన్నపేట, వెలుగు : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పేరుతో ఉన్న బ్యాగులు, టిఫిన్‌ బాక్స్​లను ఆదివారం స్పెషల్‌ స్క్వాడ్‌ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి సర్పంచ్‌ స్రవంతి అంజన్‌రావు ఇంట్లో బ్యాగులు, బాక్స్‌లు నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో ఆఫీసర్లు తనిఖీ చేసి 16 టిఫిన్‌ బాక్స్‌లు, నాలుగు వాటర్‌ బాటిళ్లు, నాలుగు బ్యాగులను గుర్తించి సీజ్‌ చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, వస్తువులను పోలీసులకు అప్పగించినట్లు ఆఫీసర్లు తెలియజేశారు. మరోవైపు గిఫ్టుల విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్​చేసిన సందీప్‌ అనే యువకుడిపై సర్పంచ్‌ భర్త అంజన్‌రావు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో అంజన్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.