కరోనా పేషెంట్లకు స్పెషల్ ఫుడ్ ప్యాకేజీలు

కరోనా పేషెంట్లకు స్పెషల్ ఫుడ్ ప్యాకేజీలు

క్వారంటైన్ టైమ్లో హోం డెలివరీ సప్లయ్ చేస్తున్న హోటల్స్, క్యాటరర్స్
ఫోన్ కాల్, వాట్సాప్ గ్రూప్స్ తో అండగా సోషల్ వర్కర్స్

హైదరాబాద్, వెలుగు: కరోనాతో హోం క్వారంటైన్ లో ఉంటూ విటమిన్స్ ఫుడ్ తీసుకోలేక పోతున్న వారికి కొన్ని హోటల్స్
మూడు పూటలా పౌష్టికాహారం అందిస్తున్నాయి. బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ కి దూరంగా పేషెంట్స్ లో వంట చేసుకోవడం రాని వారు చాలామంది ఉంటారు. కొందరికి కుకింగ్ వ‌చ్చినా కూడా టెన్షన్ తో చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం సిటీలోని పలు హోటళ్లు రూ.8వేలతో 14రోజులు హై విటమిన్స్ ఫుడ్ హోం డెలివరీ చేస్తున్నాయి. క్యాటరింగ్ చేసేవారు కూడా ఫాలో అవుతున్నారు.
ఇంటి ముందుకొచ్చి…
కొత్తపేటలోని ఓ హోటల్ 2 నెలలుగా కరోనా పేషెంట్స్ కి స్పె షల్ ఫుడ్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రస్తుతం 200 మందికి ఇంటికే ఫుడ్ సప్లయ్ చేస్తోంది. మూడు పూటలా ఫుడ్ 14 రోజులకు గాను రూ.8వేలు చార్జ్ చేస్తోంది. ఉదయం టిఫిన్, మిల్క్, జ్యూస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్ తో పాటు వాటర్ బాటిల్ పంపిస్తున్నారు. లంచ్, డిన్నర్లో సోయాబిన్, మిల్మేకర్, పన్నీర్, తోహ్ఫా, ఎగ్, ఆకు కూరలతోపాటు హై విటమిన్స్ ఉండే ఫుడ్,డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు. డోర్ డెలివరీకి 80 మంది స్టాఫ్ ఉన్నారు. డోర్ బ‌యట పార్సిల్ పెట్టి ఫోన్ చేస్తే పేషెంట్ వ‌చ్చి పార్సిల్ తీసుకెళ్తున్నారు. కొత్తపేట నుంచి 15 కిలోమీటర్ల పరిధి వరకూ సప్లయ్  చేస్తున్నారు. చాలా ఏరియాల్లో హోటల్స్ ఈ సర్వీస్ అందిస్తున్నాయి.
వాట్సాప్ గ్రూప్లతో ఫుడ్ ప్లాన్
మరోవైపు సోషల్ వర్కర్లు రిస్క్ తీసుకుంటూ కరోనా పేషెంట్ల ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసి వాట్సాప్ గ్రూ ప్స్ ఏర్పాటు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్రీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వాట్సాప్ సదుపాయం లేని వారికి నేరుగా ఫోన్ చేసి చెప్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మెడిసిన్స్ తోపాటు తీసుకోవాల్సిన ఫుడ్ ప్లాన్ల‌పై అవగాహన కల్పిస్తున్నారు.

బ్యాచిలర్స్ కి చాలా బెస్ట్

ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉంటున్న వారిని, బ్యాచిలర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ ప్రారంభించాం. కరోనా వచ్చిందన్న టెన్షన్లో ఒంటరిగా ఉండే వాళ్లు సరైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే విటమిన్స్ ఫుడ్ హోం డెలివరీ చేస్తున్నాం. టైమ్ కి అందిస్తున్నాం.                                                                              – హోటల్ ఎండీ, కొత్తపేట
ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలు
కరోనా పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్ పై ఫోన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నా. పాజిటివ్ వచ్చిన వారికి విటమిన్స్ కలిగిన ఫుడ్ చా లా అవసరం. బాడీలో ఇమ్యూనిటీ పెంచుకుంటే వైరస్ ఖతమైనట్టే. అందుకే వాట్సాప్ గ్రూపుల్లో ఏర్పాటు చేసి పేషెంట్స్ కు జాగ్రత్తలు సూచిస్తున్నా. కొందరికి ఫోన్ చేసి చెబుతున్నా. ఏదైనా అవసరముంటే ఇంటికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నా.
– పరమేశ్వరీశర్మ,కంచి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్, సికింద్రాబాద్

మ‌రిన్ని వార్త‌ల కోసం