
- అస్సాం సర్కార్ ప్రకటన
గౌహతి: అస్సాం ఉద్యోగులు తమ పేరెంట్స్, పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేందుకు నవంబర్‌లో రెండు రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేవి ఎంజాయ్ చేయడానికి కాదని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పని ఒత్తిడిని తగ్గించుకుని ఇంట్లో వాళ్లతోనే సమయం గడపాలని సీఎంవో సూచించింది.
పేరెంట్స్, అత్తామామలు లేనివాళ్లు యధావిధిగా ఆఫీస్‌కు వచ్చేయాలని, వారికి ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ వర్తించవని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ నవంబర్ 6, 8వ తేదీల్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని తెలిపింది.