
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో మంళవారం నుంచి ఆగస్టు 8 వరకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఘన వ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, ఇంజినీరింగ్, అర్బన్ బయో డైవర్సిటీ విభాగాల పనుల వ్యర్థాలు, వర్షాల వల్ల ఏర్పడిన సిల్ట్ ని తొలగించేందుకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు డ్రైవ్కొనసాగుతుందన్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, స్ట్రామ్ వాటర్ మెనెజ్ మెంట్ ఇంజినీర్లు, సర్కిల్ మేనేజర్లు, ఎంటమాలజిస్టులు డ్రైవ్ ని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.