
పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్టలోని నిమ్స్హాస్పిటల్లో అంటు వ్యాధి బాధితుల కోసం స్పెషల్ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిమ్స్డైరెక్టర్డాక్టర్ఎన్.బీరప్ప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్టీరియల్ఇన్ఫెక్షన్స్కారణంగా చాలా మంది దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించిస్తే నివారణ సాధ్యమన్నారు. స్పెషల్ఓపీ విభాగానికి అసిస్టెంట్ప్రొఫెసర్ను నియమించామని చెప్పారు. మంగళ, గురువారాల్లో జనరల్ మెడిసిన్ విభాగంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.