OTT Review: పాజిటివ్ రివ్యూలతో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రతి క్షణం ఉత్కంఠ రేపే సీన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Review: పాజిటివ్ రివ్యూలతో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రతి క్షణం ఉత్కంఠ రేపే సీన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTTలో వచ్చే సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారు. అందులో స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌‌ సిరీస్‌‌లంటే చెప్పేదే లేదు. ఎగబడి చూస్తారు. ఈ జోనర్ సినిమాల కోసం ఓ స్పెషల్‌‌ ఫ్యాన్ బేస్‌‌ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇపుడాళ్లందరీ కోసం ‘స్పెషల్ ఓపీఎస్‌‌2’ (Special Ops Season 2) సిరీస్‌ ఓటీటీలో‌ రెడీగా ఉంది.

ఈ ‘స్పెషల్ ఓపీఎస్‌‌2’ సిరీస్లో హిమ్మత్ సింగ్ అనే పాత్రలో కేకే మీనన్ లీడ్‌‌ రోల్‌‌లో నటించాడు. కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలకపాత్రలు పోషించారు. నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ సీజన్‌‌తోపాటు ‘స్పెషల్ ఓపీఎస్‌‌ 1.5: ది హిమ్మత్ స్టోరీ’లో వచ్చిన నాలుగు ఎపిసోడ్స్‌‌ ఇంప్రెస్ చేశాయి. ఇపుడీ ఈ కొత్త సీజన్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? దాన్ని కథేంటీ? అనే వివరాలు చూసేద్దాం. 

జియోహాట్‌స్టార్లో తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వారాల పేర్లతో వచ్చిన ఈ రెండో సీజన్ మొత్తం 7 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్కు రన్ టైం ఎక్కువగానే ఉంది.

ఇకపోతే ఈ సీజన్ చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తొలి సీజన్ను మించి ఈ రెండో సీజన్కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ప్రతిక్షణం ఉత్కంఠ రేపే సీన్స్తో ఆడియన్స్ను సీట్లో కూర్చోబెట్టేలా చేస్తోందని సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.

సినిమా చూసిన ఓ నెటిజన్ తన రివ్యూను షేర్ చేస్తూ.. " స్పెషల్ ఆప్స్ సీజన్ 2' ఇప్పుడే చూశాను. ఇది అద్భుతంగా ఉంది. హిమ్మత్ సింగ్ అతని బృందం ఎప్పుడూ నిరాశపరచరు. ఇంటెన్సిటీ, ట్విస్టులు, కథనం, అన్నీ మరోసారి టాప్ లో ఉన్నాయి. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా ఉంది. ఇది పెద్ద యూనివర్స్‌తో ఎలా అనుసంధానం అవుతుందన్నది నాకు చాలా నచ్చింది" అని Xలో పోస్ట్ చేశాడు. ఓవరాల్గా ఇదొక పర్ఫెక్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని ఆడియన్స్ అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు జియోహాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. చూసి వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

కథేంటంటే:

టెక్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ పీయూష్‌‌‌‌ భార్గవ్‌‌‌‌ (ఆరిఫ్‌‌‌‌ జకారియా) ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌ టెక్ సిస్టమ్స్ డిజైన్‌‌‌‌ చేస్తాడు. ఆ తర్వాత బుడాపెస్ట్‌‌‌‌లో జరిగే ఏఐ సమ్మిట్‌‌‌‌లో పాల్గొనడానికి వెళ్తాడు. కానీ.. కొందరు అతన్ని కిడ్నాప్‌‌‌‌ చేస్తారు. దాంతో ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌, ‘రా’ ఉన్నతాధికారులు పీయూష్‌‌‌‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను హిమ్మత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (కేకే మేనన్‌‌‌‌)కు అప్పగిస్తారు.

హిమ్మత్‌‌‌‌ తన టీమ్‌‌‌‌.. ఫరూక్‌‌‌‌ అలీ (కరన్‌‌‌‌ థాకర్‌‌‌‌), జుని కశ్యప్‌‌‌‌ (సయామీ ఖేర్), అవినాష్‌‌‌‌ (ఇబ్రహీం)తో కలిసి ఆపరేషన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేస్తాడు. అప్పుడే కిడ్నాప్‌‌‌‌ చేసింది సుధీర్ (తాహిర్ రాజ్ భసిన్) అని, అతను ఇండియన్ డిజిటల్ ఎకానమీని ధ్వంసం చేయడానికి కుట్ర చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత పీయూష్‌‌‌‌ని కాపాడేందుకు హిమ్మత్‌‌‌‌ ఏం చేశాడు? అతనికి ఎదురైన పరిణామాలు ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.