ఉద్యోగుల విభజన జరగట్లే.. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వట్లే

ఉద్యోగుల విభజన జరగట్లే.. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వట్లే

ఉద్యోగుల విభజన అంతులేని కథగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగుల విభజన జరగట్లే, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు సర్కార్. ఉద్యోగాల ఖాళీల లెక్క తేలినా నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు నిరుద్యోగులు. ఎంప్లాయిస్ విభజన పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంప్లాయిస్ సీనియార్టీ లిస్టుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దొంగ సర్టిఫికెట్లతో లంచాలిచ్చి.. ప్రమోషన్లు పొందాలని చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల అలకేషన్స్ వివాదాలతో.. నోటిఫికేషన్లు రాకుండా చేస్తున్న కుట్రలుగా అనుమానిస్తున్నారు. ప్రభుత్వ హడావుడి చూస్తుంటే.. నిజమేనన్నట్టుగా కనిపిస్తోందంటున్నారు నిరుద్యోగులు.  

 

 

మరిన్ని వార్తల కోసం

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా

నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్