హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

అరుణాచలం దర్శించుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లాల్సిన భక్తుల కోసం నవంబర్ 25 న నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణమవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

గతంలో ఇదే సందర్భంలో 'గిరి ప్రదక్షిణ' టూర్ ప్యాకేజీకి మంచి స్పందన వచ్చిందని... ప్యాకేజీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సుల్లో బుకింగ్‌లు ప్రారంభించిన వెంటనే సీట్లన్ ని నిండిపోయాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకొని మళ్లీ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.  

ఈ ప్రత్యేక బస్సులు నవంబర్ 25 న MGBS, BHEL, ECIL నుంచి అరుణాచలం బయలుదేరుతాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అలాగే బస్సుల్లో ఒక్కో సీటుకు రూ. 3690 చొప్పున బుక్ చేసుకోవచ్చన్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన బస్సులు.. అదే రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ ముగించుకుని అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం అవుతాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం కోసం 9959226257 లేదా 9959224911 లేదా 040-69440000 లేదా 04023450033కు కాల్ చేయాలని తెలిపారు. TSRTC కౌంటర్లలో లేదా వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల ద్వారా టిక్కెట్‌లను కన్ఫామ్ చేసుకోవచ్చని వెల్లడించారు.