న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో నుంచే పని పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ పని చేయకపోయినా, కొత్త నంబర్ మార్చాలన్నా ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది.
ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా నంబరును మార్చుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మందికి సమయం ఆదా అవుతుంది. ఓటీపీ ఆధారిత సేవలు పొందడం సులభతరం అవుతుంది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలకు మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి కావడంతో ఈ అప్‌డేట్ ఎంతో కీలకంగా మారింది.
