గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా : మంచిర్యాల డీసీపీ భాస్కర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా : మంచిర్యాల  డీసీపీ భాస్కర్

బెల్లంపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇండ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్​ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఎవరైనా గొడవలు చేస్తే పీడీ యాక్ట్​ పెట్టి జైలుకు పంపిస్తామన్నారు. గురువారం బెల్లంపల్లి రూరల్​సీఐ కార్యాలయంలో డివిజన్​ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన రౌడీ షీటర్లకు ఏసీపీ రవికుమార్ కౌన్సెలింగ్​ నిర్వహించారు. కార్యక్రమంలో  బెల్లంపల్లి రూరల్​ సీఐ హనోక్ , ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.