సికింద్రాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగల సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ మార్గాల్లో 20 స్పెషల్ ట్రైన్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబరు 15 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
తిరుపతి, -సాయినగర్, షిర్డీ, కాజీపేట, -దాదార్, హైదరాబాద్, -రక్సెల్, సికింద్రాబాద్, -ధన్పూర్, కాచిగూడ తదితర స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.