రేపటి నుంచి స్పెషల్​ ట్రైన్లు షురూ..

రేపటి నుంచి స్పెషల్​ ట్రైన్లు షురూ..

హైదరాబాద్‌‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా సోమవారం నుంచే స్పెషల్​ ట్రైన్లు నడవనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. కరోనాను అరికట్టడంలో భాగంగా పలు ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రయాణికులు జాగ్రత్తలన్నీ పాటించాలని స్పష్టం చేసింది.

ఇవన్నీ పాటించాల్సిందే..

అన్​ రిజర్వుడ్​ టికెట్లు ఉండవు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకే అనుమతి ఉంటుంది.

రైలు స్టార్టయ్యే టైం కంటే కనీసం 90 నిమిషాల ముందే స్టేషన్‌‌‌‌కు చేరుకోవాలి.

స్టేషన్లలో లైసెన్స్‌‌‌‌ డ్‌‌‌‌ కూలీలు తక్కువగా ఉంటారు. తక్కువ లగేజీ తెచ్చుకోవాలి.

స్క్రీనింగ్‌‌‌‌ టైంలో కరోనా లక్షణాలు కనిపిస్తే జర్నీకి అనుమతించరు. అలాంటి పరిస్థితుల్లో టికెట్‌‌‌‌ డబ్బులు పూర్తిగా రీఫండ్‌‌‌‌ చేస్తారు.

దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారు అత్యవసర పరిస్థితి అయితే తప్ప జర్నీ చేయొద్దు.

ప్రయాణం పూర్తయ్యే దాకా తప్పకుండా మాస్కులు ధరించాలి.

రైళ్లలో దుప్పట్లు, బెడ్‌‌‌‌షీట్ల సదుపాయం ఉండదు. సొంతగా తెచ్చుకోవాలి. ఫుడ్‌‌‌‌, వాటర్‌‌‌‌  కూడా వెంట తెచ్చుకుంటే మంచిది.

ప్రయాణికులంతా ఆరోగ్య సేతు యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవాలి.

ప్రయాణికులు గమ్యాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రొటోకాల్‌‌‌‌ పాటించాలి.

For More News..

7 లక్షల షాపులకు చావుదెబ్బ

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

ఇవి ఎడారి మిడతలు కావు.. పక్కా లోకల్​