
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 347
పోస్టులు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146; విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజినీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్
అర్హత: పోస్టును బట్టి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 25 నుంచి 35 ఏండ్లు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో 4 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ 120 నిమిషాల్లో ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరితేది: 3 సెప్టెంబర్
వెబ్సైట్: www.unionbankofindia.co.in