స్కూళ్లలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ రాజర్షి షా

స్కూళ్లలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ రాజర్షి షా
  • కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్,వెలుగు:స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

పనుల్లో ఏ మాత్రం ఆలస్యం వహించినా సహించమన్నారు. ప్రతీ పనికి స్పష్టమైన టైమ్‌లైన్‌ ఖరారు చేసి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్​ఎంలు, ఏంఈవోలు సూచించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

 రాష్ట్ర స్థాయి పీఎం శ్రీ సమీక్షలో భాగంగా ఈ నెల 21న ఉన్నతాధికారులు జిల్లాకు రానున్న నేపథ్యంలో బోథ్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్​లో అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.