తిరుమలలో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న భక్తురాలు.. తిరిగి అప్పగించిన కానిస్టేబుల్..

తిరుమలలో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న భక్తురాలు.. తిరిగి అప్పగించిన కానిస్టేబుల్..

తిరుమలలో ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. హ్యాండ్ పోగొట్టుకున్న భక్తురాలికి తిరిగి అప్పగించారు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  బెంగళూరుకు చెందిన జ్యోత్స్న అనే భక్తురాలు ఆగస్టు 18న రాత్రి సర్వదర్శనం క్యూ లైన్లో స్కానింగ్ సమయంలో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది. రూ. 2 లక్షల 7 వేలు 494 నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకోవడంతో ఆందోళనకు గురైన భక్తురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఆ సమయంలో సర్వదర్శనం క్యూ లైన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రాజీవ్ హ్యాండ్ బాగ్ ను గుర్తించి భద్రపరిచారు. హ్యాండ్ బాగ్ గురించి భక్తురాలి సమాచారం అందించారు. దీంతో తిరుమలకు చేరుకున్న భక్తురాలు జ్యోత్స్నకు మంగళవారం ( ఆగస్టు 19 ) వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ను అప్పగించారు కానిస్టేబుల్ రాజీవ్. పోయిందన్న తన బ్యాగ్ తిరిగి దక్కడంతో హర్షం వ్యక్తం చేసిన భక్తురాలు కానిస్టేబుల్ రాజీవ్ కు, టీటీడీ సిబ్బందికి కృతఙ్ఞతలు తెలియజేశారు.