భారత సంస్కృతిని ముందు తరాలకు అందించడమే లక్ష్యం : కిరణ్ సేధ్

భారత సంస్కృతిని ముందు తరాలకు అందించడమే లక్ష్యం : కిరణ్ సేధ్

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టానని స్పీక్ మేకే వ్యవస్థాపకులు కిరణ్ సేధ్ అన్నారు. సైకిల్ యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. వేల ఏళ్ల క్రితమే నాగరికతతో వెల్లివిరిసిన దేశ సాంస్కృతిక, ఆచార సాంప్రదాయాలను, సంగీత కళలను భావి భారత పౌరులకు అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు.

45ఏళ్ల క్రితం తాను ఐఐటీ ప్రొఫెసర్ గా కొనసాగుతున్న సమయంలో స్పీక్ మేకే సంస్థను ప్రారంభించినట్లు కిరణ్ సేధ్ చెప్పారు. ఈ సంస్థ ద్వారా దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ.. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న శ్రీనగర్ లో ప్రారంభమైన తన సైకిల్ యాత్ర జనవరి 31న కన్యాకుమారిలో ముగుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ పేరుతో రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.