శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్‌కు తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్‌కు  తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పెస్ జెట్ కు పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగా పొగలు కమ్మేశాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ SG 3735 విమానం నాగ్ పూర్ వచ్చేసరికి పొగలు కమ్మేశాయని ప్రయాణికులు చెబుతున్నారు . పొగ కారణంగా 20 నిమిషాలకుపైగా ఇబ్బందికి గురయ్యామని తెలిపారు.

నాగ్ పూర్ లో పొగలు గుర్తించినా విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ మాస్కులు కూడా సరిగా పని చేయలేదని వాపోయారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చివరలో విమానం సేఫ్ గా ల్యాండ్ కావటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయిన తర్వాత 96 మంది ప్రయాణికులు.. 20 నిమిషాలకు పైగా వానలోనే నిలబడ్డారు.