స్పైస్‌ జెట్ చేతిలో 100 విమానాలు

స్పైస్‌ జెట్ చేతిలో 100 విమానాలు

నాలుగో అతిపెద్ద ఎయిర్‌‌‌‌లైన్

ముంబై : బోయింగ్ 737 కొత్త విమానాన్ని చేర్చుకోవడంతో స్పైస్‌ జెట్ దగ్గర మొత్తంగా ఇలాంటి విమానాల సంఖ్య 100కు చేరింది. దీంతో తాము నాలుగో అతిపెద్ద ఎయిర్‌‌‌‌లైన్ సంస్థగా అవతరించినట్టు  స్పైస్​ పేర్కొం ది.ఎనిమిది దేశీయ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌ జెట్, గోఎయిర్‌‌‌‌, ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్, విస్తారా, ఎయిర్‌‌‌‌ ఏసియా, అలియెన్స్ ల వద్ద మొత్తంగా 595 విమానాలున్నాయి. ఒక్క నెలలోనే 23 కొత్త విమానాలను తన సంస్థలోకి యాడ్ చేసుకున్నట్టు  స్పైస్‌ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది.